ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి..

by Kema Shiva Kumar |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Malli Bhatti Vikramarka) ఢిల్లీకి పయనమయ్యారు.

ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Malli Bhatti Vikramarka) ఢిల్లీకి పయనమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ ఢిల్లీలో లోకల్ ఎలక్షన్ల నిర్వహణ, ‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశాలపై న్యాయ నిపుణుల సలహా తీసుకునేందుకు వారు హస్తినకు వెళ్తున్నట్లుగా సీఎంవో నుంచి సమాచారం అందుతోంది. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై లీగన్ ఒపీయన్ తీసుకోవడంతో పాటు హైకమాండ్‌తో భేటీకి ఢిల్లీ వెళ్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. బీసీ రిజర్వేషన్‌ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా, ఆర్డినెన్స్‌ గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. ఆ రెండు బిల్లులపై సుప్రీం కోర్టును ఆశ్రయించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులతో కాబోతున్నట్లుగా సమాచారం.

కాగా, ఢిల్లీ పర్యటన అనంతరం ఈనెల 27న సీఎం రేవంత్‌రెడ్డి బీహార్‌ (Bihar)కు వెళ్లనున్నారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోయే ఎన్నికల పాదయాత్రలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌తో పాటు తెలంగాణ మంత్రులు కూడా ఆ పాదయాత్రలో పాలుపంచుకోబోతున్నారు.

Next Story