మాజీ MLC మృతి పట్ల CM రేవంత్ సంతాపం

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-04 12:53:20  IST  )

శాసనమండలి మాజీ సభ్యుడు, సీనియర్ నాయకుడు మాగం రంగారెడ్డి(Magam Ranga Reddy) మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

మాజీ MLC మృతి పట్ల CM రేవంత్ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: శాసనమండలి మాజీ సభ్యుడు, సీనియర్ నాయకుడు మాగం రంగారెడ్డి(Magam Ranga Reddy) మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాగం రంగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. కాగా, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి బుధవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం శామీర్‌పేటలో రంగారెడ్డి అంత్యక్రియ నిర్వహించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రంగారెడ్డి సన్నిహితులుగా ఉండేవారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక సారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి మృతిపట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు.

Next Story