- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళ మాజీ సీఎం అత్యుతానందన్ మృతికి CM రేవంత్ సంతాపం
సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్(Athuthanandan) మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్(Athuthanandan) మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. కార్మిక ఉద్యమాల నుండి ప్రముఖ ప్రజా నాయకుడిగా ఎదిగిన అచ్యుతానందన్, ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో కేరళ పురోగతికి ఎనలేని సేవ చేశారని గుర్తుచేసుకున్నారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబానికి తన సంతాపాన్ని మరియు హృదయపూర్వక సానుభూతిని తెలిపారు.
కాగా, గత నెల 23న గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. 2006 నుంచి 2011 వరకు ఆయన కేరళకు సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సీపీఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ కూడా ఒకరు. 1923 అక్టోబరు 20న కేరళలో వెనకబడిన ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్.. లెనిన్, స్టాలిన్, మావోల జీవితాలతో పాటు.. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో అనేక కీలకఘట్టాలను చూసిన అత్యంత అరుదైన నేత. ఆయన మృతి కమ్యూనిస్టు నేతలను తీవ్రంగా కలిచివేసింది.






