- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth: సీఎం రేవంత్ జపాన్ పర్యటన.. నేడు ఆ కంపెనీల సీఈవోలతో భేటీ
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం (Telangana Rising Delegation) జపాన్ (Japan) పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం (Telangana Rising Delegation) జపాన్ (Japan) పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. మూడో రోజు టూర్‌లో భాగంగా ఇవాళ పలు కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భారత రాయబార కార్యాలయం (Embassy of India)లో భేటీ అయి కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. అందులో ప్రముఖ సంస్థలైన టయోటా (Toyota), తోషిబా (Toshiba), ఏసిస్ (Aces), ఎన్టీటీ (NTT) కంపెనీల సీఈఓవోలు కూడా ఉన్నారు. ఆ సమావేశం ముగిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి టోక్యో (Tokyo)లోని మహాత్మాగాంధీ (Mahatma Gandhi) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. ఆ వెంటనే టోక్యో (Tokyo) ప్రభుత్వ ప్రతినిధులతో సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భేటీ కానున్నారు. అదేవిధంగా జపాన్ ఓవర్సీస్ కార్పోరేషన్ ప్రతినిధులతో సమావేశమై సాయంత్రం సుమిదా రివర్ ఫ్రంట్‌ను సీఎం పరిశీలించనున్నారు.
కాగా, గురువారం జపాన్ (Japan)కు చెందిన మారుబేని కంపెనీ(Marubeni Company) హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ (Hyderabad Future City)లో నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పింది. దాదాపు రూ. 1,000 కోట్ల పెట్టుబడితో మారుబెనీ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో సుమారు 30 వేల మందికి ప్రత్యక్షం, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






