CM Revanth: సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన రద్దు.. అసలు ఏం జరిగిందంటే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-09 02:35:38  IST  )

చివరి నిమిషంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన రద్దయింది.

CM Revanth: సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన రద్దు.. అసలు ఏం జరిగిందంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: చివరి నిమిషంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన రద్దయింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో సీఎంతో సహా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar) తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. రేపు కేసీ వేణుగోపాల్‌ (KC Venugopal)తో మాట్లాడి తిరిగి వారంతా సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) వారితో పాటు హస్తినకు వెళ్లనున్నారు. అక్కడ ఏఐసీసీ (AICC) పెదలతో భేటీ అయి ఎమ్మెల్యే (MLA) కోటా ఎమ్మెల్సీ (MLC) అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అదేవిధంగా కేబినెట్ విస్తరణతో పాటు పార్టీలో కీలక పదవులపై నిర్ణయం తీసుకోనున్నారు.

Next Story