- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రెండో రోజు ఢిల్లీ పర్యటన (Delhi Tour) బీజీబిజీగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రెండో రోజు ఢిల్లీ పర్యటన (Delhi Tour) బీజీబిజీగా కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ ఆయన కాసేపటి క్రితం కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి (Union Civil Supplies Minister Prahalad Joshi)ని కలిశారు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) కూడా ఉన్నారు. అరగంట పాటు సాగిన ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) జారీపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Central Government) నుంచి రావల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరినట్లుగా సమాచారం. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యం బకాయిలు రూ.343.27 కోట్లు విడుదల చేయాలని, అదేవిధంగా సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఇక సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Union Urban Development Minister Manohar Lal Khattar)తో భేటీ కానున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, పలు అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. అదేవిధంగా మూసీ నది ప్రక్షాళన (Purification of Musi River), మెట్రో రైల్ ఫేజ్-2 (Metro Rail Phase-I), రిజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. అనంతరం సీఎం రేవంత్ కాంగ్రెస్ (Congress) అధిష్టాన పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యుర్థులపై వారితో సుధీర్ఘంగా చర్చించనట్లుగా తెలుస్తోంది.






