- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరానికి చేరుకున్న సీఎం రేవంత్.. కాసేపట్లో భట్టి కుమారుడి వివాహానికి హాజరు
సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనను ముగించుకుని ఇవాళ ఉదయం తిరిగి నగరానికి చేరుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. జాతీయ రాజధానిలో కాంగ్రెస్ అధిష్టానంతో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చలు జరిపిన అనంతరం ఆయన నగరానికి తిరిగి వచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరుకానున్నారు. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.
వివాహ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డడి నేరుగా అసెంబ్లీకి చేరుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారైన అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi), వేం నరేందర్ రెడ్డి (Vem Narendra Reddy) నేడు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలు చేసేందుకు నేడే చివరి రోజు కావడంతో సీఎం సమక్షంలో అభ్యర్థులు తమ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.






