పూలే సినిమా చూసేందుకు ఆర్టీసీ బస్సెక్కిన సీఎం రేవంత్, మంత్రులు

by Ajay Maddhiboyina |

పూలే సినిమా చూసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు ఆర్టీసీ బస్సులో బయలు దేరారు. ప్రసాద్ ల్యాబ్ లో సినిమాను ప్రదర్శించగా అసెంబ్లీ సమావేశం అనంతరం అందరూ కలిసి బస్సులో వెళ్లారు.

పూలే సినిమా చూసేందుకు ఆర్టీసీ బస్సెక్కిన సీఎం రేవంత్, మంత్రులు
X

దిశ‌, వెబ్ డెస్క్: పూలే సినిమా చూసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు ఆర్టీసీ బస్సులో బయలు దేరారు. ప్రసాద్ ల్యాబ్ లో సినిమాను ప్రదర్శించగా అసెంబ్లీ సమావేశం అనంతరం అందరూ కలిసి బస్సులో వెళ్లారు. దీంతో సీఎం ప్రయాణిస్తున్న బస్సులు పోలీసులు భారీ సెక్యురిటీ కల్పించారు. ఇదిలా ఉంటే పూలే సినిమాను సావిత్రీబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. హిందీలో సినిమాను తెరకెక్కించగా 2025 ఎప్రిల్ 25న విడుదలైంది. ఈ చిత్రానికి అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, డ్యాన్సింగ్ శివ ఫిల్మ్స్ కింగ్స్ మెన్ ప్రొడక్షన్స్ ఫిల్మ్స్ బ్యానర్లపై సినిమాను నిర్మించారు. చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కుల నిర్మూలనకు పూలే చేసిన కృషి, మ‌హిళ‌ల కోసం చేసిన పోరాటాల‌ను సినిమాలో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు.

Next Story