బిహార్‌కు బయలుదేరిన CM రేవంత్‌, డిప్యూటీ సీఎం.. అసలు విషయం ఇదే

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-26 03:32:13  IST  )

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka)అక్కడి నుంచి నేరుగా బీహార్‌కు బయలుదేరారు.

బిహార్‌కు బయలుదేరిన CM రేవంత్‌, డిప్యూటీ సీఎం.. అసలు విషయం ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka)అక్కడి నుంచి నేరుగా బీహార్‌కు బయలుదేరారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దర్బంగా నుంచి ఫుల్ ఫరాజ్ పట్టణం వరకు రాహుల్ గాంధీ చేపట్టబోయే ‘ఓటర్ అధికార యాత్ర’లో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ, తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి భాగస్వాములు కానున్నారు. యాత్రలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అక్కడ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో నేరుగా కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయపట్టబోయే పనులు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించనున్నారు.

కాగా, సోమవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి‌తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Malli Bhatti Vikramarka) సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi)తో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఆయనతో సమాలోచనలు జరిపారు. ‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై చర్చించారు. అదేవిధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుకూ డిస్కస్ చేసినట్లుగా తెలుస్తోంది.

Next Story