- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Open University : 32సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ యూనివర్సిటీకి సీఎం !
డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Dr. B.R. Ambedkar Open University)కి సుదీర్ఘ విరామం అనంతరం ఓ సీఎం(CM)వెళ్లారు. అది కూడా 32 సంవత్సరాల తర్వాత కావడం విశేషం.

దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Dr. B.R. Ambedkar Open University)కి సుదీర్ఘ విరామం అనంతరం ఓ సీఎం(CM)వెళ్లారు. అది కూడా 32 సంవత్సరాల తర్వాత కావడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ఆదివారం హైదరాబాద్ డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సహా యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డిజిటల్ రీసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్ స్ట్రు మెంటేషన్ సెంటర్, ఎసన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్ భవనాల పనుల ప్రారంభోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. అలా ఈ యూనివర్సిటీకి మళ్లీ ఓ సీఎం వచ్చిన అరుదైన రికార్డును లిఖించారు.
ఈ విషయాన్ని యూనివర్సిటీ వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి(University Vice Chancellor, Professor Ghanta Chakrapani)తన ప్రసంగంలో సభికుల హర్షద్వానాల మధ్య స్వయంగా వెల్లడించారు. 32ఏండ్ల క్రితం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పీ.వీ.నరసింహరావులు వచ్చి అంబేద్కర్ యూనివర్సిటీ ప్రారంభించారని..ఆ తర్వాత ఇన్నాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీలో అడుగుపెట్టారని చక్రపాణి తెలిపారు.
యూనివర్సిటీ పేరు వల్లనో లేక దూరవిద్య దూరముందనుకున్నారో ఏమోగాని ఏ ముఖ్యమంత్రి యూనివర్సిటీకి రాలేదన్నారు. ఇన్నాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి రావడం పట్ల యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు, పాలక మండలి తరుపునా కృతజ్ఞతలు తెలిపారు.






