కేసీఆర్ తొందరపాటుతోనే సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం : Bandi Sanjay Kumar

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-02-03 03:16:15  IST  )

తెలంగాణ నూతన సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.

కేసీఆర్ తొందరపాటుతోనే సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం : Bandi Sanjay Kumar
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ నూతన సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ స్పందించారు. సెక్రటేరియట్‌లో మంటలు చెలరేగడం దురదృష్టకరమన్న ఆయన.. ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటంవల్లే ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణమని ఆయన అన్నారు. సీఎం పుట్టిన రోజునే (ఫిబ్రవరి 17న) కొత్త సచివాలయ ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫైర్ సేఫ్టీ సహా అన్ని రకాల పనులను చెక్ చేసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి : ప్రారంభానికి ముందే అపశృతి.. కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం

Next Story