బ్రేకింగ్: గిరిజనులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: గిరిజనులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: పోడు భూములంటే దురాక్రమణే అని.. పోడు వ్యవసాయం పేరుతో అడవులు అన్ని నరికేయడం కరెక్ట్ కాదని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోడు భూములపై మాకు స్పష్టత ఉందని.. సాగు చేసుకునేందుకు భూములను గిరిజనులకు ఇస్తామని అన్నారు. పోడు భూముల వ్యవహారంపై ప్రతిసారి రాజకీయం చేయడం బాగా అలవాటైపోయిందని.. గత ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య ఇప్పుడు జఠిలమైందన్నారు. ఇప్పుడు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇస్తామని.. కానీ ఇదే విధంగా అడవులు నరకడం కరెక్ట్ కాదని.. దీనికి ముగింపు పలకాలని పేర్కొన్నారు. ఇకపై పోడు ఉండదని.. అడవులు దురాక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సారి 11 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తామని.. ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూములకు రైతు బంధు కూడా ఇస్తామని తెలిపారు. కానీ ఇకపై పోడు భూములకు పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఈ నెలలోనే పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పారు. దళిత బంధు తరహాలో గిరిజన బంధు కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఇది ఎన్నికల కోసం చేసే దందా కాదన్నారు. అంతేకాకుండా పట్టాలు తీసుకున్న వారు మళ్లీ అటవీ భూముల్ని ధ్వంసం చేస్తే పట్టాలు మళ్లీ వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు. గుత్తికోయలు చాలా ఆటవికంగా ప్రవర్తిస్తున్నారన్నారు. అటవీ అధికారి శ్రీనివాస్‌ను చంపేడం కరెక్టేనా అని ప్రశ్నించారు.


Next Story

Most Viewed