Odisha train accident: ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

by Satheesh |   (  Updated:2023-11-11 17:51:04  IST  )

ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Odisha train accident: ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అంటూ విచారం వ్యక్తం చేశారు. ఆ ఘోర రైలు ప్రమాదంలో పలువురు మృతి చెందడం, మరికొందరు గాయాలపాటు కావడం పట్ల సీఎం సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్యం అందించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాల్లో విశ్వాసం నింపాలని సీఎం కోరారు.

Next Story