రేపు KCRను పరామర్శించనున్న సీఎం జగన్

by Sathputhe Rajesh |   (  Updated:2024-01-03 07:11:14  IST  )

ఇటీవల తుంటి ఎముక ఆపరేషన్ చేయించుకుని డిశ్చార్జ్ అయిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్ రేపు పరామర్శించనున్నారు.

రేపు KCRను పరామర్శించనున్న సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల తుంటి ఎముక ఆపరేషన్ చేయించుకుని డిశ్చార్జ్ అయిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్ రేపు పరామర్శించనున్నారు. ఈ మేరకు గురువారం సీఎం జగన్ హైదరాబాద్‌కు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే మాజీ సీఎం కేసీఆర్ జగన్‌ల భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ జగన్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి 2018 ఎన్నికల్లో బరిలో దిగడంతో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పడం ఆనాడు సంచలనంగా మారింది. ఇక, ఏపీలో తర్వలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరి భేటీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story