CM Revanth Reddy: సర్పంచ్‌ ఎన్నికలపై హైలెవల్ మీటింగ్.. కీలక నిర్ణయం దిశగా సీఎం

by Prasad Jukanti |

లోకల్ బాడీ ఎలక్షన్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

CM Revanth Reddy:  సర్పంచ్‌ ఎన్నికలపై హైలెవల్ మీటింగ్.. కీలక నిర్ణయం దిశగా  సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల తేదీలతోపాటు బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం (High Level Meeting) జరుగుతోంది. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో (Command Control Center) జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై చర్చిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలతోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ముందుగా వేటికి ఎన్నికలు నిర్వహించాలనే విషయంలో ఇవాళ సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ గత సోమవారం ప్రభుత్వానికి తన నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టుపై ఈ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.

Next Story