చెక్‌పోస్టుల కొనసాగింపుపై సీఎం ఫైర్.. రవాణా శాఖ తీరుపై సీరియస్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-23 05:40:19  IST  )

రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా రవాణా శాఖ అధికారులు పనిచేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.

చెక్‌పోస్టుల కొనసాగింపుపై సీఎం ఫైర్..  రవాణా శాఖ తీరుపై సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా రవాణా శాఖ అధికారులు పనిచేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. ఆ శాఖలోని ఒకరిద్దరు వ్యక్తుల సొంత నిర్ణయాల వల్ల సర్కారుకు చెడ్డపేరు వస్తుందని మండిపడినట్లు తెలిసింది. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను ఎత్తివేయాలని జూలై చివరన జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయాన్ని అమలు చేయకుండా ఆ శాఖలోని కీలక వ్యక్తులు చెక్ పోస్టులను కొనసాగించి పెద్దఎత్తున ఆర్థిక ప్రయోజనాలు పొందినట్టు విమర్శలు ఉన్నాయి. ఈ మధ్య జరిగిన ఏసీబీ దాడుల్లో ఈ విషయం బహిర్గతమైంది. వాటాల పంపకాలపై లభ్యమైన ఆధారాలను ఏసీబీ అధికారులు సీఎంఓకు అందించినట్లు సెక్రెటేరియట్ వర్గాల్లో టాక్.

మా శాఖ.. మా ఇష్టం..

జీఎస్టీ అమల్లో ఉండగా అంతరాష్ట్ర సరిహద్దుల్లో రవాణా శాఖ నేతృత్వంలో కొనసాగుతోన్న చెక్ పోస్టులను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దాని స్థానంలో (ఏఎన్‌పీఆర్) ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్ననైజేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసి ట్రాన్స్‌పోర్టు వెహికల్స్ మూవ్‌‌మెంట్‌ను గుర్తించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. దీనితో జూలై మాసంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బోర్డర్‌లోని 15 చెక్ పోస్టులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. కానీ ఆ నిర్ణయాన్ని అమలు చేయకుండా, రవాణా శాఖలోని ఒకరిద్దరు వ్యక్తులు ఆడ్డుకున్నట్లు తెలుస్తున్నది. దీనితో యథావిధిగా చెక్ పోస్టులు కొనసాగాయి. రాష్ట్రంలోకి వచ్చే గూడ్స్ వెహికల్స్ నుంచి పెద్ద ఎత్తున మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఏసీబీని రంగంలోకి దింపారు.

పెద్ద ఎత్తన ఆర్థిక ప్రయోజనం

అంతరాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టులను యథావిధిగా కొనసాగించడం వల్ల రవాణా శాఖలోని ఒకరిద్దరు కీలక వ్యక్తులు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం పొందినట్లు తెలుస్తున్నది. చెక్ పోస్టుల వద్ద ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలను గంటల తరబడి ఆపేవారు. మామూళ్లు ఇచ్చిన లారీలను వెంటనే రాష్ట్రంలోని అనుమతి ఇచ్చేవారు. మిగతా వాటిని లోనికి పంపకుండా అడ్డుకునేవారు. దీనితో సహనం కోల్పోయిన లారీల డ్రైవర్లు అక్కడ ఉన్న ప్రైవేటు స్టాప్ అడినంత డబ్బులు ఇవ్వడం రోటిన్‌గా మారింది. ఇలా వసూళ్లు చేసిన డబ్బులను స్థానిక కానిస్టేబుల్స్, ఏంవీఐ, జిల్లా అధికారులు, హెచ్ఓడీలోని ఆఫీసర్లతో పాటు మరో శాఖలోని ఒకరిద్దరు కీలక వ్యక్తులకు ప్రతివారం వాటాలుగా ఇచ్చేవారని ప్రచారం ఉంది. అయితే, ఈ మధ్య ఏసీబీ జరిపిన సోదాల్లో అందుకు సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్టు తెలిసింది. వాటిని సీఎం ఆఫీసుకు అందచేయడంతో సీఎం సీరియస్‌గా స్పందించి, వెంటనే చెక్ పోస్టులను మూసి వేయాలని ఆదేశించడంతో రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంప్లిమెంటేషన్ డేట్ ఇవ్వాల్సింది ఎవరు?

అంతరాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టులను ఎత్తివేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలి. కానీ జూలై చివరలో జరిగిన మంత్రివర్గం సమావేశం నిర్ణయం ఇంతవరకు అమలు కాకుండా అడ్డుపడింది ఎవరు? అని డిస్కషన్ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్నది. మంత్రివర్గం నిర్ణయం ప్రకారం సంబంధిత శాఖ సెక్రటరీ చెక్ పోస్టులను తొలగించే తేదీని ప్రకటించాలి. కమిషనర్ వెంటనే ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి. కాని రవాణా శాఖలోని కీలక అధికారులు మాత్రం మౌనంగా ఉండటం వెనుక కొందరు వ్యక్తుల ఒత్తిళ్లు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గుర్తించినట్లు ప్రచారం జరుగుతున్నది.

ఒకేసారి వరుస దాడులు

రాష్ట్ర వ్యాప్తంగా గత శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 చెక్ పోస్ట్‌లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చెపట్టారు. చెక్ పోస్ట్ లలో లెక్కలోలేని రూ.4.18లక్షల నగదు గుర్తించి స్వాధీన పరచుకున్నట్లు పేర్కోన్నారు. ఆర్టీఏ చెక్ పోస్ట్‌లలో వాహన డైవర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఏసీబీ అధికారులు దృవీకరించారు. నిత్యకృత్యంగా మారినట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కోన్నారు. జూలై 16వ తేదిన కామారెడ్డి జిల్లాలోని పెందుర్తి ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. లెక్కలో లేని రూ.52 వేలు ఆర్టీఏ చెక్ పోస్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు. వాటిలో రూ.16 వేలు అసిస్టెంబ్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ వద్ద, రూ. 9వేలు ప్రైవేట్ ఎంజెంట్ వద్ద , రూ.4వేలు ఆఫీస్ ఫైల్ లో గుర్తించారు.

తనిఖీలు చెపట్టిన ఆర్టీఏ చెక్ పోస్ట్‌ల వివరాలు

READ MORE ...

సీఎం నియోజకవర్గం కొడంగల్‌ మీదుగా రైలు మార్గం.. భూసేకరణకు నిధులు విడుదల


Next Story