- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ను అభినందించిన సీఎం
ఉన్నత విద్యలో చేపడుతున్న సంస్కరణలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉన్నత మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఉన్నత విద్యలో చేపడుతున్న సంస్కరణలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉన్నత మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఉన్నత విద్యలో సంస్కరణల ఒరవడి ఇదే స్థాయిలో కొనసాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచలనకు ఉన్నత విద్యా మండలి కేంద్ర బింధువుగా నిలుస్తోందని మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డిని ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాలకిష్టారెడ్డి గురువారం కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఆయన సేవలను ప్రస్తావించారు. నైపుణ్యాభివృద్ధి దిశగా అన్ని స్థాయిల సమన్వయంతో ఛైర్మన్ చేస్తున్న కృషిని సీఎం ప్రశంసించారు.
తెలంగాణ ఉన్నత విద్య జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి వివిధ సందర్భాల్లో ఆకాంక్షించారు. సీఎం మనోభావాలకు అనుగుణంగా బాలకిష్టారెడ్డి గత ఏడాదిగా అనేక అంశాలపై కసరత్తు చేశారు. సిలబస్ మార్పు, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేందుకు అవసరమైన ఏర్పాట్లపై విస్తృత చర్చలు జరిపారు. ఈ దిశగా సాగుతున్న పురోగతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ కృషి ఇలాగే కొనసాగాలని, ఇతర దేశాల్లో వస్తున్న విద్యా పరమైన మార్పులకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని సీఎం దిశానిర్ధేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలను శక్తివంచన లేకుండా నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి బాలకిష్టారెడ్డి భరోసా కల్పించారు.






