- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలాఖరున నాగర్ కర్నూల్ కు సీఎం రాక..!
సీఎం కేసీఆర్ ఈ నెలాఖరులో నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనకు రానున్నారు.

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: సీఎం కేసీఆర్ ఈ నెలాఖరులో నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనకు రానున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను నిర్మించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భవనాలకు సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను పరిశీలించారు.
నిర్మాణాలు, వసతుల కల్పన పట్ల మంత్రి నిరంజన్ రెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నెల 30వ తేదీన సీఎం పర్యటన ఖరారు కావచ్చని, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన బుధవారం వెలువడనుంది. భవనాల సముదాయం ప్రారంభం తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సారథ్యంలో పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి.






