- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాగంటి గోపీనాథ్ మరణ వార్త కలచివేసింది.. CM చంద్రబాబు సంతాపం
by Gantepaka Srikanth |
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) సంతాపం తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) సంతాపం తెలిపారు. తీవ్ర అస్వస్థతతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. గోపీనాథ్ రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ అర్బన్ అధ్యక్షుడిగా పని చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 2014లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story






