సురవరం భౌతికకాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి

by Naga Rani Yarlagadda |

సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.

సురవరం భౌతికకాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మగ్దూం భవన్లో ఆయన పార్థివ దేహం ఉండగా.. ఆదివారం మధ్యాహ్నం అక్కడికి చేరుకున్న చంద్రబాబు సుధాకర్ ను చూసి భావోద్వేగానికి గురయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా సురవరం పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి సురవరం అని కొనియాడారు. సురవరం లేనిలోటుపూడ్చలేనిదని, ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Next Story