CLP Meeting : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు సీఎల్పీ సమావేశం

by Muthe.Rajitha |   (  Updated:2025-03-11 17:12:35  IST  )

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) రేపటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

CLP Meeting : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు సీఎల్పీ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) రేపటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కాగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం(CLP Meeting) జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాలు-1 లో మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్​ గౌడ్, మంత్రులు, పార్టీ శాసనసభ సభ్యులు, శాసమండలి సభ్యులు హాజరుకానున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ పరంగా వ్యవహరించాల్సిన తీరు, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఎదుర్కొవడం, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం, ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై సమాచారం, ప్రతిప్రక్షాలు చేసే ప్రచారంపై ఆధారాలతో సిద్దంగా ఉండటం తదితర అంశాలు చర్చకు రానున్నాయని సమాచారం. పార్టీ చట్ట సభల ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్​ రెడ్డి దిశానిర్ధేశం చేయనున్నారు.

Next Story