- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CLP Meeting: వీకెండ్ రాజకీయాలు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాస్

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన శంషాబాద్ (Shamshabad)లోని నోవొటెల్ (Novotel)లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం (Congress CLP Meeting) ముగిసింది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు, నాయకులకు క్లాస్ పీకారు. పార్టీలో ఉంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే.. సహించేది లేదని కామెంట్ చేశారు. ఒక్క ఎమ్మెల్యే కూడా సోషల్ మీడియా వాడటం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై విపక్షాలు నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కొందరు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలను వదిలి హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని.. వీకెండ్ రాజకీయాలు చేయొద్దంటూ హితవు పలికారు. మంత్రి పదవుల విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, ఆ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. ఎవరెవరూ ఏం మాట్లాడుతున్నారనేది అంతా రికార్డ్ అవుతూనే ఉందని జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
భూభారతి పోర్టల్‌ను రైతులకు చేరువ చేయాలి..
సీఎల్పీ సమావేశంలో ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు. గతంలో రూ.2లకే కిలో బియ్యంతో పాటు ఇప్పుడు సన్నబియ్యం పంపిణీ ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని తెలిపారు. ఇక ‘భూభారతి’ పోర్టల్‌ను రైతులకు మరింత చేరువ చేయాలని పిలపునిచ్చారు. దేశంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను పరిష్కరించామని కామెంట్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు తీసుకొచ్చామని అన్నారు. ఎస్సీ ఉపకులాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ పథకాలతో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, వర్గీకరణ వారికి ఓ గుదిబండలా మారిందన్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్‌పై చర్చ జరుగుతోందని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూములపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్‌లు చేసి ప్రభుత్వంపై విష ప్రచారం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.