Big Alert: హైదరాబాద్‌కు క్లౌడ్ బరస్ట్ హెచ్చరిక

by Gantepaka Srikanth |

గ్రేటర్ హైదరాబాద్‌(Hyderabad)తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ సిటీలో పెనుగాలులతో కుండపోతగా వర్షం కురుస్తోంది.

Big Alert: హైదరాబాద్‌కు క్లౌడ్ బరస్ట్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌(Hyderabad)తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ సిటీలో పెనుగాలులతో కుండపోతగా వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మియాపూర్‌, హిమాయత్‌నగర్‌, లక్డీకపూల్‌, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌, మాదపూర్‌, కొండాపూర్‌, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్‌, ఏఎంబీ, ఇనార్బిల్‌ మాల్, కొండాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీలో వర్షం దంచికొడుతోంది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక చేసింది. హైదరాబాద్‌కు క్లౌడ్ బరస్ట్(Cloud Burst) ముప్పు పొంచి ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. ట్వీట్

Next Story