శివ సినిమా క్లైమాక్స్ అక్కడే.. స్వప్న లోక్ ప్రమాదంపై ఆర్జీవీ ట్వీట్ (వీడియో)

by Disha Web Desk 4 |
శివ సినిమా క్లైమాక్స్ అక్కడే.. స్వప్న లోక్ ప్రమాదంపై ఆర్జీవీ ట్వీట్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: స్వప్నలోక్ కాంప్లెక్స్ కు జంట నగరాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ షాపింగ్ కాంప్లెక్స్‌లో వస్త్ర దుకాణాలు, కాల్ సెంటర్లు, ఇతర ఆఫీసులు, షాపింగ్ సముదాయాలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో షాపింగ్ కోసం ఇతర జిల్లాల నుంచి సైతం స్వప్నలోక్ కాంప్లెక్స్‌కు వస్తుంటారు. అయితే తాజాగా ఈ భవనంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం కలకలం రేపింది.

తాజాగా స్వప్నలోక్ కాంప్లెక్స్ తో తన అనుబంధాన్ని రామ్ గోపాల్ వర్మ గుర్తు చేసుకున్నారు. అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో ఆయన శివ సినిమాలోని ఓ సన్ని వేశాన్ని ట్వీట్ చేశారు. శివ సినిమాలో హీరో నాగార్జున, రఘువరన్ మధ్య క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో చిత్రీకరించినట్లు వర్మ తెలిపారు. స్వప్న లోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం గురించి ఓ న్యూస్ ఏజెన్సీ చేసిన ట్వీట్ కు ఆయన బదులిచ్చారు. ఇది చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆర్జీవీ ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed