ఖమ్మం హై టెన్షన్...సిటీ బంద్ కు పిలుపు !

by velandi.Saikiran |

ఖమ్మం హై టెన్షన్ నెలకొంది. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల ఘర్షణలో

ఖమ్మం హై టెన్షన్...సిటీ బంద్ కు పిలుపు !
X

దిశ, వెబ్ డెస్క్: ఖమ్మం హై టెన్షన్ నెలకొంది. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల ఘర్షణలో మీడియా ప్రతినిధులు గాయపడ్డారని సమాచారం అందుతోంది. ఇల్లందు క్రాస్ రోడ్డులో బీజేపీ నాయకుల తిరంగా ర్యాలీని అడ్డుకున్నారని.. ఓ వర్గంపై మరో వర్గం దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే యువకులను ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఉంచారు.

దింతో భారీగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ తరలివచ్చారు బీజేపీ పార్టీ నాయకులు. ఆ యువకులను విదేశీ కుక్కలుగా దూషించారని, నీ ఆధార్ కార్డ్ ఎక్కడ అని నిందించారని ఆరోపణలు వస్తున్నాయి. తిరంగా ర్యాలీని అడ్డుకోవడం కోసం ప్రయత్నించారని బీజేపీ నేతలు అటు ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇరువర్గాలను సముదాయిస్తున్నారు పోలీసులు. నగరంలో ఇవ్వాళ జరిగిన దాడికి నిరసనగా ఖమ్మం సిటీ బంద్ కు పిలుపనించింది బీజేపీ పార్టీ. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story