BRS: ఎల్కతుర్తి సభకు ముందే హరీశ్ రావు, కేసీఆర్ కు మధ్య క్లాష్!.. సంచలన విషయాలు బయట పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

by Prasad Jukanti |   (  Updated:2025-05-17 07:55:16  IST  )

బీఆర్ఎస్ లో హరీశ్ రావు ఎపిసోడ్ పై కేసీఆర్ సన్నిహితుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

BRS: ఎల్కతుర్తి సభకు ముందే హరీశ్ రావు, కేసీఆర్ కు మధ్య క్లాష్!.. సంచలన విషయాలు బయట పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‌లో రోజుకో అంశం హాట్ టాపిక్‌గా మారుతున్నది. మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) నివాసానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఉన్నట్టుండి బావ, బావమరిది ఏకాంత చర్చలు గులాబీ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉన్న బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు హరీశ్‌రావుకు మధ్య చిచ్చుకు ఎల్కతుర్తి సభ కారణం అయిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

అల్లుడిపై మామ ఆగ్రహం

వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో (Elkathurthy Sabha) ఏప్రిల్ 27న జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ ఏర్పాట్ల విషయంలో తొలుత అన్నీ తానై వ్యవహిరంచిన హరీశ్‌రావు.. ఆల్ ఆఫ్ సడెన్‌గా సైడ్ అయిపోయారు. ఆ తర్వాత సీన్ అంతా కేటీఆర్ సెంట్రిక్‌గా మారింది. ఈ పరిణమాల వెనుక అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్‌కు సన్నిహిత వ్యక్తి దేశపతి శ్రీనివాస్ వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుక కోసం హరీశ్‌రావు చూసిన స్థలం కేసీఆర్‌కు నచ్చలేదు.. ఆ సందర్భంలో హరీశ్‌రావుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. తనను కేసీఆర్ ఇలా అంటారా అని హరీశ్‌రావుకు కోపం వచ్చింది.. దాంతో హరీశ్‌రావు పది పదిహేను రోజులు అలకతో ఉన్నారు..’ అంటూ కీలక విషయాలు వెల్లడించారు. ఆ తర్వాత కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడటంతో హరీశ్‌రావు మళ్లీ బెట్టు వీడి కలిసి పని చేసినట్లు తెలిపారు. కేసీఆర్, హరీశ్‌రావు మధ్య తండ్రీకొడుకుల వంటి అనుబంధం ఉందని, తండ్రి మీద కొడుకు అలిగినట్టు ఈ వ్యవహారం కూడా అని చెప్పారు. ఇటువంటివి తరచూ జరుగుతుంటాయని కానీ వాటికి ప్రాధాన్యత లేదన్నారు. వాళ్లు మానవమాతృలేనని, కోపాలు తాపాలు వారికీ ఉంటాయని హాట్ కామెంట్స్ చేశారు.

కేసీఆర్ స్పీచ్ అంశాలపై హరీశ్ అభ్యంతరం

ఎల్కతుర్తి సభలో కేసీఆర్ (KCR) మాట్లాడబోయే స్పీచ్ అంశాలపై హరీశ్‌రావు కొన్ని అంశాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు దేశపతి శ్రీనివాస్ చెప్పారు. ‘ఈ సభకు నాలుగైదు రోజుల ముందు నుంచి తాను కేసీఆర్‌తోనే ఉన్నాను.. ఆ సయమంలో నాకు హరీశ్‌రావు ఫోన్ చేశారు.. కేసీఆర్ ఉపన్యాసంలో ఏం మాట్లాడబోతున్నారని అడిగారు.. అందుకు నేను కొన్ని అంశాలను చెప్పగా అవి రోటీన్ అవుతున్నాయని హరీశ్‌రావు చెప్పారు..’ అని వెల్లడించారు. అందుకు తాను మీరు ఓసారి వచ్చి ఈ ఉపన్యాసానికి సంబంధించిన విషయాలను చూడొచ్చు కదా అని అడిగానని తెలిపారు. పదవి ఉన్నా లేకున్నా బీఆర్ఎస్‌లో హరీశ్‌రావు కీలకమని దేశపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్‌లో ఏం జరగబోతోంది..

తాజాగా జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్‌లో ఏం జరగబోతున్నదనేది ఉత్కంఠగా మారింది. హరీశ్‌రావుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన మాట నిజమేనని దేశపతి శ్రీనివాసం తాజాగా స్పష్టం చేయడం, హరీశ్‌రావు నివాసానికి కేటీఆర్ వెళ్లడంతో గులాబీ పార్టీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.

Read More:

Harish Rao: బీఆర్ఎస్ లో హీటెక్కుతున్న పాలిటిక్స్.. మరోసారి హరీశ్ రావు ఇంటికి కేటీఆర్

Next Story