బ్రేకింగ్: తెలంగాణలో మొదలైన ప్రలోభాల పర్వం.. బోరబండలో తీవ్ర ఉద్రిక్తత

by Satheesh |   (  Updated:2023-11-28 17:06:40  IST  )

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో తదుపరి ఘట్టమైన పోల్ మెనేజ్మెంట్ షూరు అయ్యింది. గ్రామాలు, పట్టణాల్లో ఓటర్లను డబ్బు, మద్యం,

బ్రేకింగ్: తెలంగాణలో మొదలైన ప్రలోభాల పర్వం.. బోరబండలో తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో తదుపరి ఘట్టమైన పోల్ మెనేజ్మెంట్ షూరు అయ్యింది. గ్రామాలు, పట్టణాల్లో ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర తాయిలాలతో ప్రలోభ పెట్టే కార్యక్రమం మొదలయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని బోరబండ మహాత్మానగర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. జేపీ జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిపై ఓ బీఆర్ఎస్ నేత దాడి చేసినట్లు సమాచారం. దీంతో మహాత్మనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచారం ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా మద్యం, నగదు పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పోటాపోటీగా నాయకులు ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో మద్యం, నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఈసీ ఎంత ప్రయత్నం చేసినా.. నియోజకవర్గాల్లో మాత్రం కొత్త కొత్త దారుల్లో పోల్ మేనెజ్మేంట్ మొదలైయినట్లు టాక్.

Next Story