- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: నిర్వాహకులకు అలర్ట్.. గణపతి మండపంలో డీజేకు అనుమతిపై క్లారిటీ
గణపతి నవరాత్రుల సందర్భంగా నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను పోలీసులు(Telangana Police) విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: గణపతి నవరాత్రుల సందర్భంగా నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను పోలీసులు(Telangana Police) విడుదల చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా మండపాలు(Ganpati Mandapam) ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. డీజే పర్మిషన్ లేదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నిర్వాహకులు తప్పనిసరిగా https://policeportal.tspolice.gov.in/index.htmలో పర్మిషన్ కోసం అప్లై చేసుకొని, అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
పోలీసుల నిబంధనలు :
• మండపం ఏర్పాటు కోసం అనుమతి తప్పనిసరి
• కరెంట్ కనెక్షన్ కోసం DD తప్పనిసరి
• విద్యుత్‌కు అధికారుల పర్మిషన్ తప్పనిసరి
• మండపాల కోసం రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయొద్దు
• డీజేలకు అస్సలు అనుమతి లేదు
• రాత్రి 10 గంటల తర్వాత మైక్ వాడొద్దు
• మండపాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి
• వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేసుకోవాలి
• ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలి
• భక్తుల తాకిడికి తగినట్లు మండపాల దగ్గర ఏర్పాట్లు తప్పనిసరి
• వాహనాలు పార్క్ చేసుకోవడానికి ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలి
• అనుమానాస్పద వ్యక్తుల కదలికలు పోలీసులకు తెలియజేయాలి
• అధికారిక నిమజ్జన స్థలాలు మాత్రమే వినియోగించాలి
• పోలీస్ ఇచ్చిన అనుమతి కాపీని మండపంలో కనపడేలా ప్రదర్శించాలి






