తెలంగాణ కొత్త మంత్రులు వీళ్లే.. రేపే అధికారిక ప్రకటన!

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-07 15:17:12  IST  )

తెలంగాణ మంత్రివర్గ(Telangana Cabinet) విస్తరణకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఉదయం దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

తెలంగాణ కొత్త మంత్రులు వీళ్లే.. రేపే అధికారిక ప్రకటన!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రివర్గ(Telangana Cabinet) విస్తరణకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఉదయం దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. కేబినెట్‌‌లో కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్‌(Congress) అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. స్థానిక ఎన్నికల వేళ ఎలాంటి గొడవలకు తావు లేకుండా వ్యూహాత్మకంగా కొత్త వారికి అవకాశం ఇచ్చారు. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఈ విస్తరణలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది.

దాదాపు వీరు ఖరారు అయినట్లు సమాచారం :

మాల = చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మాదిగ = మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

ముదిరాజ్ = మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

ఇప్పటికే కసరత్తు చేసిన పేర్లను పార్టీ అధిష్టానానికి నివేదించినట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి మంత్రివర్గంలోకి తీసుకునేవారి పేర్లపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఆదివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌శర్మకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు నాలుగైదు ముహుర్తాలు ఖరారు చేసినట్లు సమాచారం. మరోవైపు నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డికి మంత్రివర్గంలో కచ్చితంగా చోటు ఇవ్వాల్సిందేనని కొందరు నేతలు పట్టుబడుతున్నట్టు సమాచారం.

Next Story