- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీలో 1743 పోస్టులకు రేపటి నుంచే దరఖాస్తులు.. ఎస్సీ సర్టిఫికేట్‍పై కీలక అప్ డేట్
ఆర్టీసీలో ఉద్యోగాల నియామకానికి రేపటి నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఆర్డీసీలో (TGSRTC Recruitment) డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల నియామకం విషయంలో ఎస్సీ కుల ధ్రువపత్రంపై తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి క్లారిటీ ఇచ్చింది. 1000 డ్రైవర్ (Drivers), 743 శ్రామిక్ (Shramiks) పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్ 17న జారీ చేసిన నోటిఫికేషన్‍కు సంబంధించి ఆన్‍లైన్ దరఖాస్తులు రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ఎల్‍పీఆర్‍బీ చైర్మన్, ఐపీఎస్ వి.వి శ్రీనివాస రావు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే షెడ్యూల్ కులాలకు చెందిన అభ్యర్థులు కొత్త ఫార్మాట్ లోనే కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. నూతన చట్టం ప్రకారం కొత్తగా నిర్దేశించిన ఫార్మాట్ లోనే ఎస్సీ కుల ధ్రువపత్రాలను తహసీల్దార్ లేదా మీ సేవా కేంద్రాల నుంచి తీసుకోవాలని సూచించారు.
ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సూచన:
కొత్త ఫార్మాట్‍లో సామాజిక వర్గం ఉప వర్గం (గ్రూప్-1/గ్రూప్2/, గ్రూప్-3) స్పష్టంగా పేర్కొంటూ కొత్తగా నిర్దేశించిన ఫార్మాట్ లోనే ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని తెలంగాణ ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఆన్‍లైన్ దరఖాస్తుల సమయంలో కొత్త ఫార్మాట్‍లో కుల ధ్రువీకరణ పత్రం లేకపోతే పాత ధ్రువీకరణ పత్రాన్ని అప్ లోడ్ చేయవచ్చని తెలిపారు. కానీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో మాత్రం కొత్త ఫార్మాట్‍లో ధ్రువీకరణ పత్రం ఉండాలని స్పష్టం చేశారు. ఒక వేళ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో కొత్త ఫార్మాట్ ధ్రువీకరణ పత్రం లేకపోతే అలాంటి అభ్యర్థులను ఎస్సీ కేటగిరీగా పరిగణించబోమని స్పష్టం చేశారు.






