హాట్ టాపిక్‌గా సివిల్ సప్లైయ్స్ స్కామ్.. నేడు EDకి ఫిర్యాదు చేయనున్న సుదర్శన్ రెడ్డి

by Kema Shiva Kumar |

రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో జరిగిన భారీ కుంభకోణంపై ఇవాళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి (Enforcement Directorate) ఈడీ అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు.

హాట్ టాపిక్‌గా సివిల్ సప్లైయ్స్ స్కామ్.. నేడు EDకి ఫిర్యాదు చేయనున్న సుదర్శన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో జరిగిన భారీ కుంభకోణంపై ఇవాళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి (Enforcement Directorate) ఈడీ అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి నాంపల్లిలో అసెంబ్లీకి ఎదురుగా ఉన్న ఈడీ కార్యాయాలనికి వెళ్లనున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) కలిసి దాదాపు రూ.1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. గతంలోనే అయన పూర్తి ఆధారాలతో హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. నెల రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, 17 నెలలు గడిచినా ప్రభుత్వం కోర్టు ఆదేశాలపై స్పందించడం లేదు. ఈ క్రమంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి మొత్తం 715 పేజీల ఫిర్యాదును ఇవాళ ఈడీ అధికారులకు అందజేయనున్నారు. ఈ కుంభకోణంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఢిల్లీ పెద్దలు గతంలో ఇంచార్జ్‌లుగా పని చేసిన వాళ్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తోంది.

కాగా, మిల్లుల్లో నిల్వ ఉన్న 35 లక్షల మెట్రిక్‌ టన్నుల (LMT) ధాన్యం సేకరణ పేరుతో రూ.700 కోట్ల నుంచి రూ.750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కోసం 2.20 ఎల్‌ఎంటీల సన్న బియ్యం కొనుగోలు పేరిట మరో రూ.300 కోట్లు..మొత్తం రూ.1,100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రధాన ఆరోపణ. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2022–23 యాసంగిలో రైతుల నుంచి సేకరించి మిల్లర్ల దగ్గర నిల్వ ఉంచిన 35 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు మూడు నెలల కింద గ్లోబల్‌ టెండర్లు (Global Tenders) పిలిచారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 50 రోజులైనా గడవక ముందే జనవరి 25న కమిటీ వేసి అందుకు మార్గదర్శకాలు జారీ చేశారని పేర్కొన్నారు.

క్వింటాలుకు రూ.2,100 చొప్పున కొనుగోలు చేయానికి రైస్‌ మిల్లర్లు ముందుకు వచ్చినప్పటికీ తిరస్కరించి కావాలనే గ్లోబల్‌ టెండర్లు పిలిచారని తెలిపారు. ప్రత్యేక నిబంధనలతో కేవలం 4 కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. అందులో కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందూస్తాన్‌ కంపెనీ, నాకాఫ్‌ అనే నాలుగు సంస్థలు బిడ్లను దక్కించుకున్నాయని పేర్కొన్నారు. గురుకులాల్లో కాంట్రాక్ట్‌ దక్కించుకున్న తర్వాత సరిగ్గా పనిచేయనందుకు కేంద్రీయ భండార్‌ అనే సంస్థను 2023లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బ్లాక్‌ లిస్ట్‌ చేసినప్పటికీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ సంస్థ కోసం నిబంధనలు సడలించిన విషయాలను పెద్ది సుదర్శన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

Next Story