- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ ముజామిల్ ఖాన్ బదిలీ
రాష్ట్ర పౌరసరపరాల శాఖలో జాయింట్సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ముజామిల్ ఖాన్జీఏడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర పౌరసరపరాల శాఖలో జాయింట్ సెక్రటరీగా, విధులు నిర్వర్తిస్తున్న ముజామిల్ ఖాన్‌ను జీఏడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా పౌర సరఫరాల డైరెక్టర్‌గా జడ్.హనుమంత్ కొడింబ నియమితులయ్యారు. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా హనుమంత్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇక పౌర సరఫరాల శాఖ సంయుక్త కార్యదర్శిగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఆశా మసరత్ ఖనమ్‌కు అడిషనల్ చార్జ్ కట్టబెట్టారు. బదిలీ అయిన అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని సీఎస్ రామకృష్ణ రావు ఆదేశాలు జారీ చేశారు. గత రెండేళ్లుగా ఖమ్మం జిల్లా కలెక్టర్ విధులు నిర్వహించిన ముజామిల్ ఖాన్ నెల రోజుల కితం పౌరసరఫరాల శాఖకు బదిలీ అయ్యారు. తాజాగా, మరోసారి ఆయన ట్రాన్స్‌ఫర్ అవ్వడం ఉద్యోగుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Next Story






