CISCO: తెలంగాణ ప్రభుత్వంతో ‘సిస్కో’ కీలక ఒప్పందం.. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశం

by Ramesh Naini |

తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇవాళ అసెంబ్లీ కమిటీని హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిస్కో (సీఐఎస్‌సీఓ) బృందం సమావేశం నిర్వహించింది.

CISCO: తెలంగాణ ప్రభుత్వంతో ‘సిస్కో’ కీలక ఒప్పందం.. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇవాళ అసెంబ్లీ కమిటీని హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిస్కో (CISCO) బృందం సమావేశం నిర్వహించింది. (Skill University) స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వంతో సిస్కో సీఎం సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అదేవిధంగా (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డితో ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పీటర్ మాలినాస్కస్ ఎంపీ బృందంతో తెలంగాణ శాసనసభ కమిటీ హాల్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా హై కమిషనర్ టు ఇండియా ఫిలిప్ గ్రీన్ కూడా పాల్గొన్నారు.

Next Story