- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెట్టింగ్ యాప్‌పై మూడు రాష్ట్రాలలో సీఐడి దాడులు
చట్ట ప్రకారం నిషేధించబడిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సీఐడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దేశ వ్యాప్తంగా మూడు రాష్ట్రాలలో ఆరు చోట్ల దాడులు నిర్వహించినట్లు సీఐడీ ఏడీజీపీ చారుసిన్హా తెలిపారు. రాజస్థాన్ , పంజాబ్ , గుజరాత్ రాష్ట్రాలలో ఆరు చోట్ల దాడులు చేపట్టి 8మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు బుధవారం ప్రకటనలో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: చట్ట ప్రకారం నిషేధించబడిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సీఐడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దేశ వ్యాప్తంగా మూడు రాష్ట్రాలలో ఆరు చోట్ల దాడులు నిర్వహించినట్లు సీఐడీ ఏడీజీపీ చారుసిన్హా తెలిపారు. రాజస్థాన్ , పంజాబ్ , గుజరాత్ రాష్ట్రాలలో ఆరు చోట్ల దాడులు చేపట్టి 8మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు బుధవారం ప్రకటనలో తెలిపారు. అరెస్ట్ అయినవారిలో తాజ్ 0077, ఫెయిర్ ప్లే లైవ్, ఆంధ్ర 365, వీఐ బుక్, తెలుగు 365, యస్ 365 బెట్టింగ్స్ యాప్స్ సంస్థల నిర్వాహకులు ఉన్నట్లు తెలిపారు.
ఈ దాడుల్లో పలు హార్డ్వేర్ పరికరాలు, భారీ ఎత్తున డేటాను అధికారులు రికవరీ చేసినట్లు తెలిపారు. దాడులలో బ్యాంక్ అకౌంట్స్ , పోన్ నెంబర్స్ , ఈ మెయిల్స్ సేకరించినట్లు తెలిపారు. సేకరించిన ఆధారాలతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులలో ఏమైనా లింక్స్ ఉన్నయా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు జరుగుతుందని అన్నారు. ఈ ఆపరేషన్‌లో 6టీమ్ లు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్ పై ఇతర రాష్ట్రాలో నిందితులను అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి అన్నారు.






