- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HCA అక్రమాలపై మరోసారి సీఐడీ విచారణ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)ని సీఐడీ మరోసారి విచారణ చేపట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)ని సీఐడీ మరోసారి విచారణ చేపట్టింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ నూతన కమిటీ సభ్యులు శుక్రవారం సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించిన నేపధ్యంలో మరోసారి సీఐడీ ఎంటర్ అయినట్లు తెలుస్తుంది. హెచ్‌సీఏ నిధుల నుంచి రూ.68.73 విశాఖ ఇండస్ట్రీస్‌కు బదిలీ చేసినట్లు స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యులు ఆరోపించారు. విశాఖ ఇండస్ట్రీస్‌కు బదిలీ చేసిన రూ.68.73 కోట్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డబ్బు చెల్లింపుల్లో తన ప్రమేయం లేదని హెచ్‌సీఏ నూతన అధ్యక్షుడు అమర్‌నాథ్ సీఐడీ అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది.
మేనేజ్‌మెంట్ హెచ్‌సీఏ నిధుల నుంచి రూ.69 కోట్లు మళ్లింపు జరిగిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ డి. గురువారెడ్డి ఆరోపించారు. ఈ నిధులను క్రికెట్ అభివృద్ధికి కాకుండా విశాఖ ఇండస్ట్రీస్ వంటి ఇతర సంస్థలకు మళ్లించారని సీబీఐ విచారణ కోరుతూ వినతిపత్రం సమర్పించారు. హెచ్‌సీఏ ఆక్రమాల పై గత సంవత్సరం జూలై నెలలో సీఐడీ విచారణ చేపట్టి హెచ్‌సీఏ కమిటీని అరెస్ట్ చేసింది. తాజాగా సీఐడి విచారణతో మరోసారి హెచ్‌సీఏ అక్రమాల అంశం చర్చనీంశంగా మారింది.






