- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HCA: హెచ్‌సీఏ నిధుల గోల్‌మాల్ కేసు స్పీడప్! ఉప్పల్ స్టేడియంలో CID కీలక విచారణ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష ఎన్నికలో నిబంధనల ఉల్లంఘటన, నిధుల గోల్ మాల్ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు స్పీడప్ పెంచినట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్ష ఎన్నికలో నిబంధనల ఉల్లంఘటన, నిధుల గోల్ మాల్ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు స్పీడప్ పెంచినట్లు తెలుస్తోంది. (HCA Secretary Devaraj) హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్‌ను సీఐడీ అధికారులు జూలై 25న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను 7 రోజుల పాటు కస్టడీకి తీసుకోని సీఐడీ (CID) అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ ఐదో రోజు కస్టడీలో దేవరాజ్ విచారాణ షురూ అయింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్న హెచ్‌సీఏ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులకు సంబంధించి అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. అలాగే నిధుల గోల్‌మాల్ విషయంలో కీలక సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తొంది. మరోవైపు ఆదివారం దేవరాజ్ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు చేసిన విషయం విదితమే.






