- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఐడీకి కేసులంటే అంతే సంగతులు
మనీ ఫ్రాడింగ్, రియల్ ఎస్టేట్ మోసాలు, క్రిప్టో కరెన్సీ పేరుతో నమోదైన కేసుల విచారణలో పురోగతి కనిపించడం లేదు. బాధితుల ఫిర్యాదుతో కేసులు మొదట సీసీఎస్ ( క్రైమ్ విభాగం) లో నమోదువుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: మనీ ఫ్రాడింగ్, రియల్ ఎస్టేట్ మోసాలు, క్రిప్టో కరెన్సీ పేరుతో నమోదైన కేసుల విచారణలో పురోగతి కనిపించడం లేదు. బాధితుల ఫిర్యాదుతో కేసులు మొదట సీసీఎస్ ( క్రైమ్ విభాగం) లో నమోదువుతున్నాయి. కేసు తీవ్రత బట్టి సీఐడి (క్రైమ్ ఇన్వేస్టిగేషన్ డిపార్ట్మెంట్ )కు బదిలీ చేస్తున్నారు. గత కొద్దికాలంగా సీఐడీ చేపట్టిన కేసులలో విచారణలో అసలు నిందితులను అరెస్ట్ చేయడంలో జాప్యం జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. సీఐడి విడుదల చేస్తున్న పత్రికా ప్రకటనలలో కేసు నమోదై సంవత్సరాలు గడిచిన తర్వాత నిందితులను అరెస్ట్ చేసిన ఘటనలు మాత్రమే ఉన్నాయి. సీఐడి బాధ్యతలను మొన్నటి వరకు చూసిన ఉన్నతాధికారికి మరో మూడు అదనపు బాధ్యతలు కూడా ఉండటంతో సీఐడీ విభాగం పై దృష్టి సారించలేక పోయారని వినికిడి. ప్రస్తుతం సీఐడీ విభాగానికి అడిషనల్ డీజీపిగా నియమితులైన తెలంగాణకి చెందిన ఐపీఎస్ అధికారి తన మార్క్ ఇన్వేస్టిగేషన్ చూపితే న్యాయం జరుతుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఫాల్కమ్ స్కామ్ లో కొసరు నిందితులను పట్టుకుంటున్న సీఐడీ
ఇటీవల కాలంలో మనీ ఫ్రాడింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బాధితులు కూడా వందల సంఖ్యలో ఉంటున్నారు. ఇటుంవంటి కేసులలో ముఖ్యంగా ఫాల్కన్ స్కామ్ కేసు ఉంది. సీఐడి ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో నిందితులుగా పేర్కోన్న వారిని వివిధ రాష్ట్రలలో సీఐడి అరెస్టు చేసినట్లు గత సీఐడి డీజీ పలు ప్రకటనలో వెల్లడించారు. కానీ సీఐడి పట్టుకున్న నిందితులు కేసులో నమోదైన కొసరు నిందితులుగా తెలుస్తున్నది. ఇటివల కాలంలో సీఐడీ అరెస్ట్ చేసిన నిందితులు కేసులో ఏ21, ఏ23, ఏ24గా ఉన్నారు. బాధితులకు కేసు పురోగతి పై అందోళన నెలకొంది. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన ఫాల్కన్ స్కామ్ కేసులో 4065 మంది బాధితుల నుంచి రూ.792 కోట్లు మోసాలకు పాల్పడ్డారని సీఐడీ వెల్లడిస్తుంది. అధిక వడ్డీ రేట్ల సాకుతో డిపాజిటర్లను ప్రలోభపెట్టి 7056 డిపాజిటర్ల నుంచి సుమారు రూ.4,215 కోట్లు వసూలు చేశారని తెలుస్తుంది. మే 18వ తేదిన ఇద్దరు నిందితులను ఏ23, ఏ24 అరెస్ట్ చేసింది. జూన్ ఐదవ తేదిన కేసులో ఏ21 నిందితుడిగా పేర్కొన్న ఒకరిని సీఐడీ అరెస్ట్ చేసి రూ.2.5 కోట్ల విలువైన మూడు కార్లను సీజ్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసును ఈడి కూడా దర్యాప్తు చేస్తుంది. రూ.850 కోట్ల విలువ చేసే విమానాన్ని ఈడి స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో మిగతా నిందితు అరెస్ట్, నష్ట పరిహరం పై బాధితులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని బాధితులు కోరుతున్నారు.
* హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన అవయవ దానం మార్పిడి కేసును కూడా సీఐడీ దర్యాప్తు చేస్తుంది. అలకనంద హస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో 13మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐడీ అధికారులు తెలుపుతున్నారు. ఈ కేసులో ఇంకా ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారు పట్టుబడితే కానీ కేసు విచారణ కొలిక్కి వచ్చేలా లేదు.
* జీబీఆర్ క్రిప్టో కాయిన్ చీటింగ్ కేసు కూడా సీఐడీ చేతిలో ఉంది. అధిక లాభాల పేరుతో ఆశ చూసి డిపాజిటర్ల నుంచి సుమారు రూ.95 కోట్లు వసూలు చేశారని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. ఇటీవల అరెస్ట్ చేసిన నిందితులు కేసులో ఏ11,12లుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులుగా పేర్కొన్న ఏ1, ఏ2 , ఏ6, ఏ7 అరెస్ట్ చేసింది. మిగతా వారిని అరెస్టు చేస్తేనే కేసు ముందుకు వెళ్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*బెట్టింగ్ యాప్ కేసు కూడా సీఐడీ పరిధిలో ఉంది. ఐజీ స్థాయి అధికారిని సిట్ అధికారిగా కూడా నియమించారు. ఐదుగురు సభ్యులతో కూడిన స్పెషల్ టీం ను ఏర్పాటు చేశారు. ఈ కేసులలో కూడా పురోగతి లేదు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఉన్న నియమ నింబధనల మేర, బెట్టింగ్ యాప్ నిర్వహకులు విదేశాల నుంచి యాప్ నిర్వహణ చేయడంతో కేసు ముందుకు సాగడం లేదు.






