సైబర్ నేరాలపై CID చీఫ్ మహేశ్ భగవత్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
సైబర్ నేరాలపై CID చీఫ్ మహేశ్ భగవత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: భవిష్యత్తులో సైబర్​నేరాలు మరింతగా పెరుగుతాయని సీఐడీ ఛీఫ్​మహేశ్​భగవత్​చెప్పారు. ఇంటర్నెట్​ఉపయోగిస్తున్న ప్రతీ ఒక్కరికి సైబర్​నేరస్తుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్టు తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ వ్యవహారాల శాఖ సూచనల మేరకు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్​ఆర్డీ) తో కలిసి సీఐడీ విభాగం 30మంది జూనియర్ సివిల్​జడ్జీలకు సైబర్​నేరాలు, చట్టాలు అన్న అంశంపై ఎంసీహెచ్​ఆర్డీలో సోమవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా భగవత్ మాట్లాడుతూ.. సైబర్​నేరస్తుల ఉచ్చులో చిక్కి మోసపోయిన కొందరి కేసులను ప్రస్తావించారు. ఓ వ్యక్తి ఇంటర్నెట్‌లో చూసి ఆర్థిక అవసరాలను తీర్చుకోవటం కోసం ఓ కిడ్నీని అవసరమైన వ్యక్తికి ఇచ్చాడని తెలిపారు.

అయితే, బాధితున్ని వలలోకి లాగిన సైబర్​నేరస్తుడు ఇస్తానని చెప్పిన మొత్తంలో కేవలం పదిశాతమే ఇచ్చి ఇంటికి పంపించి వేశాడని తెలిపారు. ప్రతీరోజూ సైబర్​మోసాల వార్తలు వెలుగులోకి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే అని చెప్పారు. సైబర్​నేరాలపై పోలీసులు, పబ్లిక్​ప్రాసిక్యూటర్లు, జ్యుడిషియల్​ఆఫీసర్లు, అదనపు సెషన్స్​జడ్జీలు మరింతగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం ప్రారంభమైన శిక్షణా తరగతులు ఈనెల 29వరకు కొనసాగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఐజీగా పనిచేసి రిటైర్​అయిన ఉమాపతి, సైబర్​లా ఎక్స్​పర్ట్, టెక్నో లీగల్​కన్సల్టెంట్​డాక్టర్​సాయి సుశాంత్, సైబర్​సెక్యూరిటీ నిపుణుడు శ్రీనివాస్, విజిలెన్స్​అండ్​ఎన్​ఫోర్స్​మెంట్​డీఎస్పీ రవికుమార్​రెడ్డి, సైబర్​క్రైం ఇన్వెస్టిగేషన్​సీఐ పద్మతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story