- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఐ Vs సైదిరెడ్డి.. ఇద్దరి మధ్య డైలాగ్ వార్!
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఓ సీఐపై ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలింగ్ సరళిని పరిశిలించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సైదిరెడ్డి హుజూర్ నగర్ వీవీ మందిర్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి తన అనుచరులతో పాటు వచ్చారు.
సీఐ Vs సైదిరెడ్డి.. ఇద్దరి మధ్య డైలాగ్ వార్!ఈ క్రమంలో ఎమ్మెల్యే గులాబీ కలర్ కండువా కప్పుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా కండువా తీయాలని సీఐ కోరారు. దీంతో సీఐపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీ కండువా కాదని ఎమ్మెల్యే బదులిచ్చారు. ఏదైనా కానీ అది బీఆర్ఎస్ జెండా కలర్ మీరు వేసుకొచ్చిన జెండాకు ఒకే పోలిక ఉన్నందున దానిని తొలగించాలని సీఐ చెప్పారు. ఈ క్రమంలో మంచిగా మాట్లాడాలని ఎమ్మెల్యే అనగా తాను మంచిగానే మాట్లాడుతున్నానని సీఐ బదులిచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.






