- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విత్తన ఎగుమతులపై జపాన్ ,తెలంగాణ మధ్య ఒప్పందం.. జపాన్ ప్రతినిధుల భేటీ
రాష్ట్ర విత్తన రంగ అభివృద్ధి, ఎగుమతులు, దిగుమతులపై జపాన్, తెలంగాణ మధ్య పరస్పర సహకార ఒప్పందం కుదిరింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర విత్తన రంగ అభివృద్ధి, ఎగుమతులు, దిగుమతులపై జపాన్, తెలంగాణ మధ్య పరస్పర సహకార ఒప్పందం కుదిరింది. సోమవారం విత్తన అభివృద్ధికి ఉన్న అవకాశాలు అధ్యయనం చేయడానికి జపాన్-ఇండియా సహకార ఆర్గనైజేషన్, చైర్మన్, కెంజీ ఒకుమూర, వైస్ చైర్మన్, జూన్ ఓయబు ప్రతినిధుల బృందం రాష్ట్రాన్ని సందర్శించారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జి. చిన్నా రెడ్డి (Chinna Reddy) అధ్యక్షతన జపాన్ ప్రభుత్వ ప్రతినిధుల బృందం విత్తన ధ్రువీకరణ సంస్థలో ముఖాముఖీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణను అంతర్జాతీయ విత్తన హబ్ తీర్చిదిద్దెందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, తెలంగాణ విత్తన రంగాన్ని మరింత అభివృద్ధి పరచడంలో భాగంగా భవిష్యత్తులో తెలంగాణ-జపాన్ మధ్య పరస్పర సహకారం ఉండేలా అంగీకారం జరిగిందన్నారు.
జపాన్ నుంచి అధిక దిగుబడిని ఇచ్చే కూరగాయలు, పూల విత్తనాలను దిగుమతి చేసుకొని, పైలెట్ ప్రాజెక్టు క్రింద తెలంగాణలో విత్తనోత్పత్తి చేపట్టడం జరుగుతుందన్నారు. విత్తనోత్పత్తిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇమేజింగ్ టెక్నాలజీ లాంటి అధునాతన సాంకేతికతతో వినియోగం చేస్తామన్నారు. విత్తన ఆరోగ్యం, విత్తనం మొలకెత్తు శక్తి, విత్తన దీర్ఘాయువు, లాంటి అంశాలలో తగిన సాంకేతికతను పొంది తెలంగాణ నుంచి మరిన్ని విత్తన ఎగుమతులను ప్రోత్సహిస్తామన్నారు. తెలంగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తికి ఉన్న అవకాశాలు, మెరుగైన మౌలిక వసతులు, తెలంగాణ విత్తన పరిశ్రమ సామర్థ్యం, పరస్పర సహకారానికి ఉన్న అవకాశాల గురించి తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డా. కేశవులు వివరించారు. అనంతరం జపాన్ ప్రతినిధులు గ్లోబల్ సీడ్ హబ్ గా తెలంగాణాను తీర్చిదిద్దటానికి ప్రభుత్వం తీసుకుంటున్న విధాన పరమైన అంశాలను ప్రశంసించారు.






