- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలు అనుకుంటే అది పెద్ద కష్టమేం కాదు.. చినజీయర్ స్వామి హాట్ కామెంట్స్
చిలుకూరి బాలాజీ ఆలయ(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకుడు రంగరాజన్(Priest Rangarajan)పై జరిగిన దాడిని చినజీయర్ స్వామి ఖండిచారు.

దిశ, వెబ్‌డెస్క్: చిలుకూరి బాలాజీ ఆలయ(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకుడు రంగరాజన్(Priest Rangarajan)పై జరిగిన దాడిని చినజీయర్ స్వామి ఖండిచారు. సోమవారం ఆయన చినజీయర్ స్వామి(Chinna Jeeyar Swamy) మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో ఆలయ అర్చకుల పరిస్థితి బాగోలేదని అన్నారు. సమాజంలో హింసకు తావులేదని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే రామరాజ్య స్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రజలంతా ముక్తకంఠంతో అనుకుంటే రామరాజ్య స్థాపన కష్టమేం కాదని అన్నారు. అంతకుముందు రంగరాజన్‌ను బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ట్విట్టర్‌లో ఈ ఘటనకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రంగరాజన్‌పై దాడి ఘటనపై హిందూ ధర్మ పరిరక్షకులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనికి సంబంధించిన వీడియోలున్నా ప్రభుత్వం ఏం చేస్తోంది? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితమే రంగరాజన్‌పై దాడి జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో ఆయనపై కొందరు దాడి చేసినట్టు స్థానిక పోలీసులకు చేశారు. మొత్తం 20 మంది తనపై దాడి చేశారని ఆవేదన చెందారు. రంగరాజన్‌పై దాడి కేసుకు సంబంధించి ఆదివారం ఒకరిని అరెస్టు చేసినట్టు మొయినాబాద్ పోలీసులు(Moinabad Police) తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశామని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.






