- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీరు పర్మిషన్ ఇవ్వకున్నా విగ్రహం పెడతాం.. అనుమతిపై పోలీస్‌లకు రిక్వెస్ట్ లాంటి వార్నింగ్
ణపతి నవరాత్రుల కోసం మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు అనుమతి తప్పనిసరిగా తీనుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: గణపతి నవరాత్రుల కోసం (Ganesh Mandapams) గణేశ్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు అనుమతి తప్పనిసరిగా తీనుకోవాలని (Police permission) తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పల్లె నుంచి పట్నం వరకు పోలీసులకు అన్‌లైన్‌లో అనుమతులు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్టేషన్లకు లేఖలు రాసి అనుమతి పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే రిక్వెస్ట్ లాంటి వార్నింగ్ లేఖను పోలీసులు చూసి షాక్ అయ్యారని, లేఖ నెట్టింట వైరల్‌గా మారింది. లేఖలో ఉన్న ప్రకారం.. ‘గౌరవనీయులైన కేశంపేట పోలీస్ స్టేషన్ ఎస్‌ఐకి వ్రాయునది ఏమనగా మేము అంటే కొత్తపేట గ్రామానికి చెందిన చిన్న యువకులం. రమేశ్ కుమారుడు హర్షవర్ధన్, కృష్ణ కుమారుడు శివ కుమార్, నక్క నరేశ్ కొడుకు యశ్వంత్, నక్క రాము కొడుకు సందీప్ తెలియజేయునది ఏమనగా.. మేము భారీ స్థాయిలో వినాయక విగ్రహం పెట్టాలనుకుంటున్నాము. దానికి మీ అనుమతి ఇవ్వగలరు. నోట్.. మీరు అనుమతి ఇవ్వకున్నా మేము విగ్రహం పెడతాం. మర్యాదపూర్వకంగా అడుగుతున్నాం. ఇట్లు గణపతి సేవకులు’ అంటూ లేఖలో పేర్కొన్నారు. అలాగే లేఖలో పిల్లలు సంతకాలు కూడా చేశారు. ఈ లేఖ చూసిన పోలీసులు ఖంగుతిన్నారు. ఇందుకు సంబంధించిన లేఖ వైరల్ అవ్వడంతో ఎవర్రా మీరంతా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. కాగా, ఈ లెటర్ ప్రస్తుతానిది కాదని, గతంలో జరిగిన వినాయక చవితికి సంబంధించిన లెటర్ అని తెలుస్తోంది.






