- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లికి భరోసా, పిల్లలకు భవిష్యత్.. బాలాపూర్ పోలీసుల మానవతా స్పర్శ
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసులు ఇద్దరు విద్యార్థులకు అండగా నిలిచారు. తల్లి మానసిక వేదనతో బాధపడుతున్న..

దిశ, సిటీ క్రైం : రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసులు ఇద్దరు విద్యార్థులకు అండగా నిలిచారు. తల్లి మానసిక వేదనతో బాధపడుతున్న నేపథ్యంలో పిల్లలను పాఠశాలకు పంపకుండా ఉండటంతో పోలీసులు సత్వరంగా స్పందించారు.
మంగళవారం ఉదయం డయల్ 100కు వచ్చిన సమాచారం మేరకు హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర కుమార్, హోంగార్డు వెంకటేష్ బాలాపూర్‌లోని సంబంధిత ఇంటికి చేరుకున్నారు. అక్కడ పరిశీలించిన పోలీసులు అసలు విషయాన్ని తెలుసుకున్నారు.
రెండేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో ఆ మహిళ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యిందని, అప్పటి నుంచీ పిల్లలను బడికి పంపడం మానేసినట్టు గుర్తించారు. ఇంటి పరిసరాలు కూడా నిర్లక్ష్యంగా ఉండటాన్ని గమనించిన పోలీసులు తల్లిని ఆదరిస్తూ ఆమెకు భరోసానిచ్చారు.తర్వాత కుమారుడిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించగా, కూతురిని స్థానిక ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతిలో చేర్పించారు. తల్లికి కౌన్సెలింగ్ అందించారు.
బంధువులు, స్థానికుల సహకారంతో బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ మహిళకు మానసిక వైద్య చికిత్స కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బాలాపూర్ పోలీసుల స్పందనపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తూ ధన్యవాదాలు తెలిపారు. పోలీసుల చొరవతో పిల్లలు మళ్లీ బడిలో చేరడం ఆనందాన్ని కలిగించిందని వారు వ్యాఖ్యానించారు.






