- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video: హైవేపై అడ్డంగా సైకిల్‌తో చిన్నారి! పాలేరులో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
ఖమ్మం జిల్లా పాలేరులో హైవేపై ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Khammam District Paleru) ఖమ్మం జిల్లా పాలేరులో హైవేపై ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన (highway) హైవే రహదారి వద్ద ఓ చిన్నారి పై వెళ్తుండగా అటుగా వస్తున్న లారీని గమనించలేదు. దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి లారీని అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన సీసీఫూటేజీ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. (bicycle) సైకిల్‌పై స్కూల్ విద్యార్థి హైవేపై గమనించిన డ్రైవర్ లారీని అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే కిందకు లారీ దిగిన డ్రైవర్ ఆ విద్యార్థిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. సైకిల్‌పై అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. ఒక ప్రాణాన్ని కాపాడాడని లారీ డ్రైవర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు హైవే మీదకు సైకిల్ పై పిల్లలు రాకుండా జాగ్రత్త వహించాలని, తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.






