- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షమాపణలు చెప్పాలనే సోయి లేదా? రాజమౌళిపై చికోటి ప్రవీణ్ మరోసారి ఫైర్
దర్శకుడు రాజమౌళిపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ మరోసారి ఫైర్ అయ్యారు. రాజమౌళి బుద్ధి తెచ్చుకుని క్షమాపణలు కోరుతాడని అనుకున్నామని కానీ అలా చేయలేదన్నారు. కల్లు తలపైకి ఎక్కి క్షమాపణ చెప్పాలనే సోయి కూడా లేనట్టుంది అని వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు రాజమౌళిపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ మరోసారి ఫైర్ అయ్యారు. రాజమౌళి బుద్ధి తెచ్చుకుని క్షమాపణలు కోరుతాడని అనుకున్నామని కానీ అలా చేయలేదన్నారు. కల్లు తలపైకి ఎక్కి క్షమాపణ చెప్పాలనే సోయి కూడా లేనట్టుంది అని వ్యాఖ్యానించారు. రాజమౌళిని గారు నుండి ఇప్పుడు రాజమౌళి గాడు అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా హిందూ సమాజానికి రాజమౌళి క్షమాపణలు చెప్పాలన్నారు. తన తీరు ఇది కాదని రాజమౌళి నిరూపించుకోవాలన్నారు.
లేదంటే భగవంతుడు ఊహించని రీతిలో శిక్షిస్తాడని హెచ్చరించారు. ఇన్నిరోజులు రాజమౌళికి సక్సెస్ లు వచ్చినప్పుడు రాజమౌళి హనుమంతుడి వల్లనే వచ్చాయని ఎందుకు చెప్పలేదన్నారు. ఇప్పుడు చిన్న సమస్య రాగానే దేవుడిపై వ్యాఖ్యలు చేశారన్నారు. హిందూ సమాజం నీ సినిమాలను చూడకపోతే బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. ముందు ముందు కూడా హిందూ సమాజంపై విద్వేషం చూపే విధంగా మాట్లాడితే దాడులకు పాల్పడతామని వార్నింగ్ ఇచ్చారు.






