రేపు భద్రాచలానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

by velandi.Saikiran |   (  Updated:2025-04-05 13:34:49  IST  )

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy ) భద్రాచలం ( Bhadrachalam) పర్యటన ఖరారు అయింది.

రేపు భద్రాచలానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy ) భద్రాచలం ( Bhadrachalam) పర్యటన ఖరారు అయింది. రేపు ఉదయం భద్రాచలానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth reddy) పయనం కానున్నారు. కుటుంబ సమేతంగా... భద్రాద్రి రామయ్య ను ( Bhadradri Ramaiah ) దర్శించుకోబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శ్రీరామ నవమి పండుగ ( Sri Ram Navami festival ) నేపథ్యంలో కుటుంబ సమేతంగా భద్రాచలం వెళ్తున్నారు.


ఇక ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా భద్రాద్రి రాములవారికి పట్టు వస్త్రాలు ( Silk cloths ) సమర్పించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ పలువురు మంత్రులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే అధికారులు కూడా రానున్నారని తెలుస్తోంది. ఈ మేరకు... అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా... చూస్తున్నారు.

అటు భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత... ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని చెబుతున్నారు. భద్రాచలం నియోజకవర్గం లో సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం కూడా చేయనున్నారని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా, శ్రీరామ నవమి పండుగ ( Sri Ram Navami festival ) నేపథ్యంలో భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక నిధులు కూడా విడుదల చేసింది సర్కార్.




Next Story