- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్గొండకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ.200 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ సాయంత్రం నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ సాయంత్రం నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరారు. హైదరాబాద్‌లోని బేగంపేట (Begumpet) విమానాశ్రయం నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా జిల్లాకు పయనమయ్యారు. సీఎంతో పాటు ఈ పర్యటనలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే, సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే నల్గొండ జిల్లా యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ముందుగా మిర్యాలగూడ మండల పరిధిలోని గూడూరు గ్రామంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.200 కోట్ల భారీ వ్యయంతో ఈ విద్యా సంస్థను నిర్మించనున్నారు.
కాగా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను సర్కార్ నిర్మిస్తోంది. శంకుస్థాపన అనంతరం సీఎం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా జిల్లాలో పలు అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష జరిపే అవకాశం ఉంది.






