Chennamaneni Ramesh Babu : ఓటరు లిస్టు నుంచి చెన్నమనేని పేరు ఔట్

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్(Chennamaneni Ramesh Babu ) కు మరో షాక్ ఎదురైంది.

Chennamaneni Ramesh Babu : ఓటరు లిస్టు నుంచి చెన్నమనేని పేరు ఔట్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్(Chennamaneni Ramesh Babu ) కు మరో షాక్ ఎదురైంది. వేములవాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పేరు ఓటరు లిస్టు నుంచి తొలగించారు(Name Removed from Voter List) అధికారులు. తెలంగాణ హైకోర్టు ఆయన జర్మనీ పౌరసత్వం(German Citizenship) కలిగి ఉన్నట్లు నిర్ధారించినందున, ఎన్నికల సంఘం ఫామ్ 7 ప్రకారం ఆయన పేరును ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంది. అధికారులు రమేష్ నివాసం వేములవాడలోని సంగీత నిలయంలో నోటీసు అందజేసి, రిజిస్ట్రార్ పోస్ట్ ద్వారా సమాచారం పంపారు.

ఆయన భారత పౌరసత్వం రద్దయిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉండటం, తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించడంతో తెలంగాణ హైకోర్టు 2024 డిసెంబర్‌లో ఆయన భారత పౌరసత్వం రద్దు చేసి, రూ.30 లక్షల జరిమానా విధించింది.

Next Story