- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్లారెడ్డిపేటలో చిరుత సంచారం.. అటవీశాఖ అధికారులు రంగంలోకి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో చిరుత సంచారం ప్రజల్లో భయాందోళనకు గురిచేస్తోంది.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో చిరుత సంచారం ప్రజల్లో భయాందోళనకు గురిచేస్తోంది. మండలంలోని రాగట్లపల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్ సోమవారం ఉదయం తన పొలానికి వెళ్లిన సమయంలో చిరుతను ప్రత్యక్షంగా చూశాడు. ఘటనను వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశాడు.
సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత చుట్టూ ఉన్న అడుగుజాడలను గుర్తించారు. చిరుత ఆచూకీ కోసం అధికారులు ఎల్లారెడ్డిపేట శివారులతో పాటు వెంకటాపూర్ పరిసర అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇప్పటివరకు చిరుత కనిపించకపోవడంతో అధికారులు అప్రమత్తంగా ఉండమని ప్రజలకు సూచించారు. చిరుత సంచార వార్తలతో పంట పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. గ్రామాల్లో భయ వాతావరణం నెలకొంది. అటవీశాఖ అధికారులు చిరుత ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.






