- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షపు నీటికి చెక్.. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి.. రూ.253 కోట్లతో ఎస్ఎన్‌డీపీ పనులు
వరద ముంపు నుంచి లోతట్టు ప్రాంతాలను కాపాడేందుకు నాలాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్పీడప్ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: వరద ముంపు నుంచి లోతట్టు ప్రాంతాలను కాపాడేందుకు నాలాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్పీడప్ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వర్షాకాలానికి ముందుగానే పూర్తిచేయాలని ఇంజినీరింగ్ అధికారులకు కమిషనర్ కర్ణన్ ఆదేశాలు జారీచేశారు. అందులో భాగంగానే మొదటి దశలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్డీపీ) ద్వారా రూ.980కోట్లతో పూర్తిచేశారు. రెండో దశలో రూ.253కోట్లతో ప్రారంభించిన పనులు వివిధ దశలో ఉన్నాయి.
రెండు దశలో..
గత ప్రభుత్వ హయాంలో ఎస్ఎన్డీపీ మొదటి దశ కింద సుమారు రూ. 980 కోట్లతో సుమారు 36 వరద ముంపు నివారణ పనులను చేపట్టారు. అయితే ఆ పనులను జీహెచ్ఎంసీ 90 శాతానికి పైగా పూర్తి చేసింది. అయితే రెండో దశలోనూ సుమారు రూ.253కోట్లతో 13 పనుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎస్ఎన్డీపీ రెండు దశల్లోని పనులు వర్షాకాలానికి ముందుగానే పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 13 మొదటి దశకు సంబంధించినవికాగా.. మిగిలిన 11 పనులను కూడా రెండో దశ కింద చేపట్టినట్టు చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ తెలిపారు. అవసరమైన చోట బాక్స్ డ్రెయిన్, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, కాలువలు, పైప్ లైన్లు, వంతెనలు వంటి పనులు చేపట్టారు. వర్షం కురిసినప్పుడు ఎత్తైన ప్రాంతాల్లోని వర్షపు నీరు దిగువన ఉన్న ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరడం వంటి ఘటనలు జరిగిన ప్రాంతాలను గుర్తించి, ఎస్ఎన్డీపీ ద్వారా పనులను చేపట్టారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో భారీగా చేరే వర్షపు నీరు నిలువకుండా పైప్ లైన్లను ఏర్పాటు చేసిన వర్షపు నీరు సమీపంలోని నాలాల్లోకి వెళ్లేలా కూడా ఈ పనులు చేపట్టారు. కొన్ని చోట్ల కొత్తగా డ్రెయిన్లు, బాక్స్ డ్రెయిన్లను నిర్మించటంతో పాటు మరికొన్ని చోట్ల పాతకాలపు వరద నీటి కాలువలను ఆధునీకరించి నిర్మిస్తున్నారు.






